ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ

UPDATED 24th MAY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక స్టేషన్ సెంటర్ లో ఆటో డ్రైవర్ల వివరాలతో కూడిన గుర్తింపు కార్డులు గురువారం సామర్లకోట ఎస్.ఐ ఎల్. శ్రీనివాస్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భమగా ఆయన మాట్లాడుతూ  ప్రతి ఆటోకి బార్ కోడ్, ఆటో డ్రైవర్, ఆటో ఓనర్ ల పూర్తి వివరాలతో కూడిన ఈ గుర్తింపు కార్డులు అందచేశామన్నారు. ఆటో ప్రమాదానికి గురైనప్పుడు, ఆటోలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయినపుడు ఈ బార్ కోడ్ ఆధారంగా ఆటో వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది, ఆటో ఓనర్లు, ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us