UPDATED 13th JUNE 2017 TUESDAY 4:00 PM
సామర్లకోట: ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం హెడ్ మాస్టర్ పి. భీమశంకరం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కెజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను, అలాగే అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నభోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు సైకిళ్లు, యూనీఫామ్స్, నగదు రహిత లావాదేవీలను నిర్వహించేవారికి స్మార్ట్ ఫోన్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి, ఎఎంసి ఛైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), జడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఎంపిపి గొడతా మార్త, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ఎంఈవో రమణమ్మ, ఎంపీడీవో నాగేశ్వరరావు, డాక్టర్ అనంత పద్మనాభం, మన్యం చంద్రరావు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







