UPDATED 26th MARCH 2022 SATURDAY 09:30 PM
Krishna Vrinda Vihari: యువ నటుడు నాగశౌర్య నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అయితే.. శౌర్య మాత్రం వరుస సినిమాలతో లక్ పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. నాగశౌర్య నటించిన తాజా సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించగా.. షెర్లీ షెటియా కథానాయకిగా నటించింది. ఆమధ్య ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయగా టీజర్ అప్డేట్ ఇస్తూ ఇప్పుడు మరో పోస్టర్ వదిలింది యూనిట్.
ఏప్రిల్ 22న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్న టీం మార్చి 28న టీజర్ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా టీజర్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యూనిట్ ఓ పోస్టర్ వదిలింది. ఈ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే శౌర్య-షెర్లీ రొమాంటిక్ పోస్టర్ యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది.







