UPDATED 22nd AUGUST 2017 TUESADAY 2:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎం.పునీత్ కుమార్ కు రాష్ట్ర స్థాయి హెవీ బాక్సింగ్ పోటీలు 91 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీల్లో విజయవాడలో జరిగిన ఓపెన్ మీట్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తమ కళాశాల విద్యార్థికి గోల్డ్ మెడల్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఎం. శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రమాశ్రీ , ఫిజికల్ డైరెక్టర్ సి.హెచ్. మురళీమోహన్ తదితరులు అభినందించారు.







