AP News: ప్రభుత్వానికి వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగుల హెచ్చరిక.. డిమాండ్లు నెరవేర్చకుంటే 7నుంచి సమ్మె..

Updated 31 January 2022 Monday 05:20 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): పీఆర్సీ విషయమై ఇప్పటికే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పుడు మరో శాఖ ఉద్యోగులు కూడా సమ్మె యోచనలో ఉన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే తాము కూడా సమ్మె చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు చేపట్టనున్న సమ్మెకి ఏపీ వైద్యఆరోగ్య శాఖ మద్దతిచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి తాము సైతం సమ్మెలో పాల్గొంటామని వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 3న జరిగే చలో విజయవాడను విజయవంతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల జేఏసీ నేత ఆస్కార్ రావు చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us