UPDATED 30th APRIL 2018 MONDAY 6:45 PM
పెద్దాపురం: స్థానిక ఆర్.డి.వో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తొమ్మిది అర్జీలు వచ్చినట్లు ఆర్డీఓ వి. విశ్వేశ్వరరావు తెలిపారు. వీటిలో సర్వేనిమిత్తం రెండు, వెబ్ ల్యాండ్ కరెక్షన్ రెండు, అడంగల్ కరక్షన్ ఒకటి, హౌసింగు ఒకటి, ఇళ్ళ పట్టాలు నిమిత్తం ఒకటి, భూ ఆక్రమణలు గురించి ఒకటి, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు నిమిత్తం ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్.డి.వో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.







