UPDATED 18th FEBRUARY 2018 SUNDAY 6:30 PM
సామర్లకోట: క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఏర్పాటు చేసిన గిరిజన జోన్ పరిధిలో ఆటల పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. వైసిపి కౌన్సిలర్ ఊబా జాన్ మోజెస్ క్రీడా జెండాను ఎగురవేశారు. వాలీ బాల్, కబడ్డీ కోర్ట్ లను ఏపీ ఏటిడబ్ల్యూవో రామతులసి ప్రారంభించారు. అనంతరం క్రీడలు విద్యార్థుల మధ్య ఆసక్తికరంగా సాగాయి. ఈ పోటీల్లో ఏడు మండలాలకు చెందిన 143 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్.ఎం వానలత అధ్యక్షత వహించగా వైసీపీ కౌన్సిలర్లు జుత్తుక సుబ్బలక్ష్మి, పితాని సూర్యనారాయణ, వివిధ మండలాల పీడీలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







