బిచ్కుంద (రెడ్ బీ న్యూస్) 18 డిసెంబర్ 2021 : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిచ్కుంద మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బిచ్కుంద నుంచి పిట్లం వస్తోన్న కారు.. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా సమాచారం. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా వారి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.







