అమరావతి (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: ఏపీలో ఆర్థిక అసమానతలు 38శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సీఎం జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు. తిరోగమన వృద్ధి నుంచి రెండంకెల వృద్ధి సాధించేందుకు జగన్ ప్రభుత్వ కార్యచరణను బయటపెట్టాలన్నారు. ఆర్థిక క్రమశిక్షణ గాలికొదిలేసి, అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దిగజార్చడంపై చర్చ చేసేందుకు గ్రీన్‌పేపర్ విడుదల చేయాలని ఓ ప్రకటనలో యనమల డిమాండ్ చేశారు.







