Chiranjeevi: పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అంటోన్న గాడ్‌ఫాదర్!

UPDATED 13th OCTOBER 2022 THURSDAY 09:30 PM

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరుకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.

ఇక ఈ సినిమా సక్సెస్‌ను చిరు ఎంజాయ్ చేస్తుండగా, వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు.తాజాగా, సినిమా జర్నలిస్టులతో చిరు ముచ్చటించారు. ఈ సందర్భంగా చిరు కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను గాడ్‌ఫాదర్ సినిమా చేయడానికి ముఖ్య కారణం రామ్ చరణ్ అని చిరు తెలిపారు.

ఇక ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని చిరు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఓ విలేకరి చిరును ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తారా అని చిరుని అడగ్గా.. తనకు మంచి కథ వస్తే, ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు.ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరు, పవన్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us