గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 30th OCTOBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో రూ. ఒక కోటి ఏడు లక్షల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్ అధ్యక్షతన ఎస్సీ పేటలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదల ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా పనిచేస్తున్నామని, పెదబ్రహ్మదేవం గ్రామంలో గత నాలుగున్నర సంవత్సరాల్లో రూ.5 కోట్ల 50 లక్షలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నేడు   రూ.కోటి రూపాయల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సిసిరోడ్లు, డ్రైనులు నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే రూ.ఎనిమిది లక్షలతో రెండు కమ్యూనిటీ భవనాలను ప్రారంభించామని అన్నారు. గ్రామంలో 250 మందికి గృహాలు మంజూరు చేశామని, వీటిని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, సోమాలమ్మ, మారమ్మ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.50 లక్షలతో కాపు కళ్యాణ మండపం త్వరలో నిర్మిస్తామని, గ్రామంలో రూ.ఒక కోటి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. డిసెంబరు, జనవరి నాటికి గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు నూరుశాతం పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. డ్వాక్రా మహిళలకు పసుపు, కుంకుమ క్రింద పూర్తిస్థాయిలో ఆర్థిక సహకారం అందించామని, ఈ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ త్వరలోనే చెల్లిస్తామని, కేంద్రప్రభుత్వ సహకారం లేకపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు ఆదాయం వచ్చేలాగ ప్రభుత్వం ప్రతిపాదనలో ఉందని, ఎస్సీ, బిసి, కాపు కార్పోరేషన్లు  ద్వారా రుణాలు అందచేస్తున్నామని, గ్రామంలో కాలువ ర్యాంపు నిర్మాణానికి చర్యలు చేపడతానన్నారు. యువతకు ఉద్యోగ కల్పనకు పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎస్సీ యువత విదేశాల్లో విద్యను అభ్యసించడానికి, అలాగే పోటీ పరీక్షలకు ఢిల్లీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గర్భిణీ స్త్రీలకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 20 మంది రైతులకు ప్రభుత్వ సబ్సిడీలతో సమకూర్చిన ట్రాక్టర్లను ఆయన అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు, ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, కాకర్ల ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ నల్లి శామ్యూల్ జాన్, మార్ని రామకృష్ణ, మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు..

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us