UPDATED 24th JANUARY 2018 WEDNESDAY 5:00 PM
గండేపల్లి: కాకినాడ జె.ఎన్.టి.యు నిర్వహించిన ఆరవ స్నాతకోత్సవంలో 2013 -17 బ్యాచ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని సి.హెచ్. హైమావతి అన్నపూర్ణ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, మానవ వనరుల అభివృద్ధి శాఖ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుందని, ఇంతటి ఘనత సాధించిన విద్యార్థినిని ఆయన అభినందించారు. అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్.కుమార్ చేతుల మీదుగా పి.హెచ్.డి పట్టాలు అందుకొన్న తమ కళాశాలకు చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్.వి.ఎస్. రామకృష్ణ, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణలను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, కళాశాల అకడమిక్ కమిటీ మెంబర్లు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు తమ అభినందనలు తెలియచేసారు.







