రంపచోడవరం, 27 మే 2020 (రెడ్ బీ న్యూస్): ప్రతి ఒక్కరికి ఉపాధిపనులను కల్పించడంతో పాటు
జాబ్ కార్డులను జారీ చేయాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వెలుగు, ఉపాధి హామీ, వాటర్ షెడ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. ఆయా అంశాలలో సాధించిన
పురోగతిపై సమీక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు. రోజువారీగా పనులు కల్పనలో ఆశించిన పురోగతి లేదన్నారు.
వేతన కూలీల సంఖ్యను మరింతగా ఈ నెలలో పెంచాలన్నారు. 90 శాతం ఆవాసాల్లో ఉపాధి హామీ
పనులున్నాయన్నారు. వెలుగు, ఉపాధిహామీ సిబ్బంది గ్రామీణాభివృద్ధిలో కీలకభూమికను పూర్తి
సమస్వయంతో పోషించాలన్నారు. ఏపీడీలు పూర్తి సమయం ఉపాధి పనులు నిర్వహణకు కేటాయించాలన్నారు. ఉద్యానసాగుకు గిరిజనులు ముందుకు వస్తే అందుకు అనుగుణంగా ఉపాధి అనుసందానంతో
అంచనాలు జనరేట్ చేస్తూ మూడు సంవత్సరాలు పాటు మొక్కలు పెంపకానికి తోడ్సాటునందించడం
జరుగుతుందన్నారు. ఉద్యానసాగు విస్తీర్ణం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేతనాలు సకాలములో చెల్లించేలా పోస్టల్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించాలని ఆదేశించారు. ఎస్.ఎం.ఐ ఇంజనీర్లు, వాటర్ షెడ్ టెక్నికల్ సిబ్బంది సహజ వనరుల నిర్వహణకై గతంలో ఎక్కడెక్కడా చెరువులు
సరస్సులు, నీటి నిల్వలకు సంబందించి వనరులు ఉన్నాయో పూర్వపు నీటి సంఘాల ద్వారా గుర్తించి వాటి
పునరుద్ధరణకై ఉపాధి హామీ అనుసందానంతో అంచనాలు జనరేట్ చేస్తూ ఈ వేసవిలో వాటికి మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. వాటి పునరుద్ధరణ అనంతరం ఆయా నీటి వనరులలో దోమలు వ్యాప్తి చెందకుండా
యాంటీ లార్వా ఆపరేషన్లు మలేరియా శాఖ ద్వారా చేపడతామన్నారు. నీటి వనరులుకు సంబంధించిన
ఆక్రమణలు ఉత్పన్నమైనట్లయితే వాటిని సంబంధిత తాహశీల్దార్ సహకారంతో పరిష్కరించడం
జరుగుతుందన్నారు. నిరుపేద గిరిజన మహిళలకు పేదరిక నిర్మూలనా కార్యక్రమాలను వర్తింపజేస్తూ వారు
పేదరికాన్ని జయించేలా తోడ్పాటునందించాలన్నారు. స్వయం ఉపాధి ద్వారానే మహిళా సాధికారతకు
పాటుపడాలని వెలుగు
సిబ్బందికి సూచించారు. వివిధ రకాల స్వయం ఉపాధి కార్యక్రమాలు అమలు చేసే
దిశగా రుణాలుతో ప్రోత్సాహించి వారి జీవనోపాధిని మెరుగుపర్చాలన్నారు. ఉన్నతి కార్యక్రమాలలో భాగంగా గిరిజన తెగలు వారికి రుణాలు కల్పనకు పాటుపడుతూ బహళ ప్రయోజనాలు ఒనగూరే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. కుటుంబ స్థితిగతులను మార్చేశక్తి మహిళకు కూడా ఉందని నిరూపించేలా
మహిళలకు పెద్దపీట వేయాలన్నారు. కుటుంబ షొషణలో మహిళల పాత్ర కీలకం కావడంతో వారికి ఆర్థికంగా బలంచేకూర్చేందుకు తోడ్పాటునందించాలన్నారు. ప్రస్తుత కాలములో ఉపాధి హామీ పనులు విరివిగా చేపట్టాలని తదనుగుణంగా నిరుపేద గిరిజనులు వలసలు నివారణతో పాటుగా
వారి కొనుగోలు శక్తి పెంపొంపుదలకు తగిన ప్రోత్సాహాం అందించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఎంఐ విశ్వనాధరెడ్డి, వెలుగు ఏపీడీ సత్యం నాయుడు, వాటర్ షెడ్ ఏపీడీ లక్ష్మయ్యబాబు, ఉపాధి ఏపీడీలు కోటేశ్వరరావు, సాయిబాబా,ఆర్.డబ్ల్యుఎస్ డిఈలు నాగవెంకట పద్మనాభం, రవీంద్రబాబు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.