TS News: ఆ పోస్టులకు బీఈడీ చేసిన బీటెక్‌ అభ్యర్థులూ అర్హులే: హైకోర్టు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021‌: తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థుల అర్హతపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం బీఈడీ పూర్తి చేసిన బీటెక్‌ అభ్యర్థులు అర్హులని తీర్పునిస్తూ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను కొట్టివేసింది. బీఈడీ చేసిన బీటెక్‌ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని.. నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని సంబంధిత శాఖకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us