శాగో ఫ్యాక్టరీ యాజమాన్యాల పై ఆర్డీవో ఫైర్

UPDATED 31st MAY 2017 WEDNESDAY 10:30 PM

కాకినాడ: సామర్లకోట మండలము పరిధిలో ఉన్న శాగో ఫాక్టరీల యాజమాన్యాలతో కాకినాడ రెవిన్యూ డివిజినల్ అధికారి ఎల్.రఘుబాబు బుధవారం సమావేశము నిర్వహించారు. ముఖ్యంగా సామర్లకోట మండల పరిధిలోఉన్న శాగో ఫాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధ పదార్ధాల వల్ల చెరువులు, పంట కాలువలు, గాలి, నీరు కలుషితము అవుతున్నాయని  ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా  శాగో ఫ్యాక్టరీల యాజమాన్యాలు వ్యర్ధ పదార్ధాలను  శుద్ధి చేసే రీ సైక్లింగ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లను పది రోజులలో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాక్టరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశములో శాగో ఫ్యాక్టరీ యజమానులు, సామర్లకోట తహశీల్దారు ఎల్. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us