భూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

UPDATED 23rd JUNE 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: రైతులకు ఎదురవుతున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ ఎల్. శివకుమార్ కోరారు. మండలంలోని పండ్రవాడ, భీమవరం గ్రామాలలో శనివారం నిర్వహించిన రెవిన్యూ సదస్సుల్లో అడంగల్ సవరణకు పది, సర్వే నిమిత్తం పన్నెండు దరఖాస్తులు స్వీకరించామని, ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను ఈ వేదిక ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చని, అడంగల్‌, ఆన్ లైన్లో భూముల వివరాలు తప్పుగా నమోదైతే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us