తిరుమల (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : తిరుమల శ్రీవారి నిత్యన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.2 కోట్లు విరాళంగా అందాయి. భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా ఈ విరాళానికి సంబంధించిన చెక్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డికి అందజేశారు.







