వైకుంఠనాథుడిగా సింహాద్రి అప్పన్న

సింహాచలం (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022: ముక్కోటి ఏకాదశి పుణ్యదినాన్ని పురస్కరించుకుని గురువారం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠ వాసుడిగా ఆలయ ఉత్తర ద్వారంలో భక్తజనావళికి దర్శనమిచ్చారు. గురువారం వేకువజాబున స్వామి వారికి సుప్రభాత సేవ అనంతరం ధూప సేవ, సేవాకాలం వంటి ప్రభాత ఆరాధనలు పూర్తిచేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో సర్వస్వర్ణాభరణాలతో వైకుంఠవాసుడిగా అలంకరించి, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఇత్తడి శేషపాన్పు వాహనంపై ఉంచి భక్తుల హరినామ స్మరణల నడుమ ఆలయ బేడా మండపంలో తిరువీధి కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ఆలయ ఉత్తర ద్వారంలోకి తీసుకువచ్చి అప్పటివరకు ఉన్న మేలిముసుగును తొలగించారు. స్వామి వారిని తొలుత విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, తర్వాత ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి తమ్మినేని సీతారామ్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు, ఎమ్మెల్యేలు పీజీవిఆర్‌ నాయుడు (గణబాబు), పెందుర్తి ఎమ్మెల్యే ఎ.అదీ్‌పరాజ్‌, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, తదితరులు ఉన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us