Updated 6th December 2022 1:15 pm
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో చాలా కాలం తరువాత చిరంజీవి ఊరమాస్ అవతారం ఎత్తడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్, బాస్ పార్టీ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమాలో చిరు పాత్రను ఊరమాస్‌గా తీర్చిదిద్దాడట దర్శకుడు. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేయడంతో అభిమానులు సంక్రాంతి పండగ కోసం ఆతృతగా చూస్తున్నారు. కానీ.. ఇప్పటికే సంక్రాంతి బరిలో వస్తున్న మరికొన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసుకోవడంతో వీరయ్య ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.