పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కృషి

Updated 20th April 2017 Thursday 7:30 PM

పెద్దాపురం: పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి , హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.  ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా భూగర్భ జలాలను పెంపొందించేందుకు చేపట్టిన నీరు చెట్టు కార్య క్రమాన్నిఆయన గురువారం పెద్దాపురం పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా నీటిని పొదుపు చేయడం, పరిరక్షించడం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే భూగర్భజలాలను పెంపొందించేందుకు ఎంతో ముందు చూపుతో ప్రభుత్వం ఈ కార్య క్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం కలక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ఈ ఏడాది నీరు చెట్టు, నీరు ప్రగతి కార్యక్రమాల పేరుతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దీనిలో ప్రభుత్వ, స్వచ్చంద సంస్థలు, కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేసి వర్క్ షాప్ లు ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం స్థానిక కొత్తపేట వద్ద ఉన్న చెరువు గట్టు పై హోం మంత్రి తో కలిసి మొక్కలు నాటారు. అలాగే శతాబ్ది పార్క్ ను పరిశీలించారు. ఈ కార్య క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కోరుపూరి రాజు, ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ ఏ. వెంకట్రావు, పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారు బాబు, టిడిపి పట్టణ కార్యదర్శి తూతిక రాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us