TTD: శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

తిరుమల (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : తిరుమల శ్రీవారి ఆలయంలో 25 రోజులపాటు జరగనున్న అధ్యయనోత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో కార్యక్రమాలు నిర్వహించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేశారు. ఉత్సవాల్లో శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ చిన్న జీయర్‌స్వామి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, వేదపండితులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us