కనకమహాలక్ష్మి రెండో గురువారం పూజలకు ఏర్పాట్లు

విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఈనెల 16న జరగనున్న రెండో గురువారం పూజలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి గురువారం గుర్తించిన లోపాలను సరిదిద్దుతున్నారు. ఈసారి రూ.100, రూ.200 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్లను రీడింగ్‌ రూమ్‌ నుంచి ప్రారంభిస్తున్నారు. ఉచిత దర్శనాలు సున్నపువీధి నుంచి మొదలు కానున్నాయి. రూ.500, ప్రొటోకాల్‌ పరిధి దర్శనాలు ఘోషాస్పత్రి నుంచి ప్రారంభమవుతాయి. ఈ మేరకు క్యూలైన్లను సిద్ధం చేస్తున్నామని డీఈఈ సీహెచ్‌.వి.రమణ తెలిపారు. ఈఓ మాధవి ఆదేశాల మేరకు ఆలయ ఆవరణలో పోలీసు అవుట్‌పోస్టు, ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత వారం మాదిరిగా వాహనాల పార్కింగ్‌ను పోలీసులు పర్యవేక్షిస్తారని, మెయిన్‌రోడ్డులో సున్నపువీధి నుంచి బస్సులు, ఇతర వాహనాలను మళ్లిస్తారని చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us