లోకేష్ పర్యటనకు సర్వం సిద్ధం

Updated 17th April 2017 Monday 7:00 PM

సామర్లకోట: రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ పర్యటనకు సర్వం సిద్ధం అయింది. ఈ మేరకు ఏర్పాట్లను హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం పరిశీలించి విలేఖరులతో మాట్లాడారు. ఇటీవల సామర్లకోట మండలం జి. మేడపాడు గ్రామం జాతీయ స్థాయిలో పంచాయతీ రాజ్ స్వశక్తీకరణ గౌరవ పురస్కారానికి ఎంపిక కావడంతో గ్రామం యొక్క కార్యక్రమాలను స్వయంగా తెలుసుకోవడానికి  ఇక్కడకు వస్తున్నట్లు హోం మంత్రి తెలిపారు. గ్రామం లో స్వచ్ఛ భారత్  అమలు, వర్మీ కంపోస్ట్ యార్డుల నిర్వహణ, రోడ్లు డ్రైనేజీలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ మొదలైన విషయాలను ఆయన స్వయంగా పరిశీలిస్తారని మంత్రి తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, గుమ్మళ్ల రామకృష్ణ, మన్యం చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us