UPDATED 14th MAY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డి ప్రజా సంకల్పయాత్ర రెండు వేల కిలోమీటర్లు చేరుకోవడంతో ఆయనకు మద్దత్తుగా వంచనపై ప్రజా గర్జన పాదయాత్ర కార్యక్రమాన్ని పెద్దాపురం నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ పాదయాత్ర మండల పరిధిలోని చంద్రపాలెం గ్రామం నుంచి ప్రారంభమై గొంచాల, అచ్చంపేట, బ్రహ్మానందపురం మీదుగా సామర్లకోట చేరుకుంది. అనంతరం స్థానిక స్టేషను సెంటర్ లో బాణాసంచాతో కాల్చి జై జగన్, జై వైఎస్ఆర్ సిపి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ ఈ పాదయాత్రకు అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీ నారాయణ, కంటే వీర్రాఘవులు, పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను, మాజీ జడ్పీటీసీ బొబ్బరాడ సత్తిబాబు, జిల్లా కార్యదర్శి మేకా శ్రీను, కౌన్సిలర్ కాళ్ల లక్ష్మీనారాయణ, పట్టణ కోశాధికారి శెట్టిబత్తుల దుర్గ, టౌన్ సెక్రెటరీ, సేపేని సురేష్, జిల్లా సెక్రెటరీ మంచం సాయి, నేతల హరిబాబు, గంప శివ, పెద్దాపురం యూత్ ప్రెసిడెంట్ గోగు మురళి, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







