వైయస్సార్ చేయూత పథకం ద్వారా గొర్రెలు, మేకలు పెంపకం

UPDATED 20th OCOBER 2020 TUESDAY 8:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): జిల్లాలో వైయస్సార్ చేయూత పథక ద్వారా గొర్రెలు, మేకల పెంపకానికి సుమారు ఎనిమిది వేల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్  కార్యాలయంలో అలానా కంపెనీ ప్రతినిధులు, పశుసంవర్ధకశాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైయస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధిదారులకు గొర్రెలు, మేకలు పెంపకానికి  రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామిక సంస్థ అలానాతో ఎంవోయూ కుదుర్చుకుందని అన్నారు. జిల్లాలో శంఖవరం మండలం వజ్రకూటురులో అలానా కంపెనీ ఫ్యాక్టరీని నిర్మించనున్నట్లు తెలిపారు. వైయస్సార్ చేయూత లబ్ధిదారులను డిఆర్డిఎ, సెర్ఫ్ ద్వారా ఎంపిక చేసి, బ్యాంకు లింకేజీ రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.టి. శ్రీనివాసరావు, అలానా కంపెనీ ప్రతినిధి మహేష్ కుమార్ పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us