మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

UPDATED 20th JUNE 2017 TUESDAY 6:00 PM

పెద్దాపురం : మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రంజాన్ తోఫా కానుకల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మంగళవారం మాట్లాడారు. ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఈ రంజాన్ తోఫా కానుకలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు ఆయన చేతుల మీదుగా గునపాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, పెద్దాపురం ఏరియా అభివృద్ధి కమిటీ  చైర్మన్ బొడ్డు బంగారుబాబు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎంపిడివో పి. వసంత మాధవి, ఏపీవో రాయి ప్రభాకరావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us