CM Jagan On Revenue : ఆదాయం పెంచాలని సీఎం జగన్ ఆదేశాలు, ఆ శాఖ ప్రక్షాళనకు నిర్ణయం

UPDATED 10th JUNE 2022 FRIDAY 06:50 PM

CM Jagan On Revenue : ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల అధికారులతో సీఎం జగన్ శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణ, మైనింగ్, రిజిస్ట్రేషన్లు, భూగర్భగనులు, అటవీ శాఖల మంత్రులు, ఉన్నధికారులతో సమీక్ష నిర్వహించారు జగన్. శాఖల వారీగా ప్రగతిని సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్.

రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. వాణిజ్య పన్నుల శాఖలో ప్రతి ఒక్కరి బాధ్యతపై స్పష్టత ఉండాలన్నారు ముఖ్యమంత్రి జగన్. అటు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్నాయని అన్నారు సీఎం జగన్. బొగ్గు గనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బొగ్గును ఏపీ అవసరాలకు వినియోగించుకునేలా చూడాలన్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించి తనకు నివేదిక ఇవ్వాలన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us