UPDATED 7th DECEMBER 2018 FRIDAY 9:00 PM
రాజానగరం: గైట్ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డేటా అనలిటిక్స్ విత్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే అంశంపై శుక్రవారం సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నన్నయ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎం. కమలకుమారి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. డేటా సైన్స్ & డేటా అనలిటిక్స్ ప్రాముఖ్యత, అతి పెద్ద సంస్థలకు ఏవిధంగా ఉపయోగపడతాయో వివరించారు. డేటా అనలిటిక్స్ చేయడానికి ఆర్ ప్రోగ్రామింగ్ అనే టూల్ ఉపయోగించి అందులోని ఫంక్షన్ డేట్ పై గ్రాఫిక్స్ ఎలా తయారుచేయాలో వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వల్లీమాధవి కళాశాల తరఫున కమలాకుమారిని ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు జి. చంద్రయ్య, జి. శేషుకుమార్, ఎం. శ్రీధరశర్మ, ఏవో ఎస్ఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.







