డీఆర్వోగా జితేంద్ర బాధ్యతల స్వీకరణ

UPDATED 17TH MAY 2017 WEDNESDAY 2:30 PM

కాకినాడ : జిల్లా రెవెన్యూ అధికారిగా ఎం.జితేంద్ర బుధవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. గతంలో ఆయన రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌గా, ఆర్డీవోగా, తహసీల్దారు గా, డిప్యూటీ  తహసీల్దారుగా సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాతో తనకు మంచి  అనుబంధం ఉందని, రెవెన్యూ శాఖ ద్వారా సేవలను ప్రజలు సత్వరం అందేలా కృషి చేస్తానన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్‌ మల్లికార్జునలను మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు చేపట్టిన ఎం.జితేంద్రను జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, తదితరులు కలిసి అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us