UPDATED 26th JUNE 2022 SUNDAY 05:00 PM
YS Jagan: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు.
వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు 19,352 ఓట్లువ చ్చాయి.ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఆర్ఎస్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించడం పట్ల ఏపీ సీఎం, వైఎస్ఆర్ సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పందించారు. భారీ మెజార్టీతో విక్రమ్ రెడ్డి విజయం సాధించడవం పట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.. విక్రమ్ ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. మంచిచేస్తున్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష అంటూ సీఎం జగన్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.







