Updated 15th April 2017 Saturday 9:55 PM
పెద్దాపురం : తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఒక యువతి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం గ్రామానికి చెందిన ఈ యువతి పోలీస్ స్టేషన్ లో ఆరు నెలల క్రిందట కుటుంబ కలహాల నేపథ్యం లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడం తో నిరాశ చెంది పురుగులమందు తాగినట్లు బాధితురాలు తల్లి తెలిపింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ యువతిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.







