Updated 22nd April 2017 Saturday 11:30 PM
పెద్దాపురం : విద్యార్థులకు సకాలంలో ధృవపత్రాలు అందచేసేందుకు రెవిన్యూ శాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న "విద్యార్థి సేవలో రెవిన్యూ శాఖ " కార్యక్రమం భేష్ అని పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అన్నారు. పెద్దాపురం పట్టణంలో స్థానిక బంగారమ్మగుడి వీధిలో ఉన్న వీర్రాజు హైస్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను దృష్టి లో ఉంచుకుని నేరుగా వారి వద్దకే వెళ్లి కావలసిన ధృవ పత్రాలను జారీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ధృవ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, కౌన్సిలర్ వాసంశెట్టి గంగ, పాఠశాల హెచ్ఎం ఖమర్ జహాన్, తదితరులు పాల్గొన్నారు.







