UPDATED 15th FEBRUARY 2018 THURSDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 14 నుంచి 17 వరకు జరుగుతున్న జాతీయస్థాయి గో- కార్ట్ రేసింగ్ పోటీలకు విద్యార్థులు రెడీ అయ్యారు. విద్యార్థులు తమ సృజనకు మెరుగులు దిద్దుతూ టీం వర్క్ తో అధ్యాపకుల సూచనలు, మెళకువలను పాటిస్తూ తమ కార్ట్ డిజైన్ వర్క్ లో పూర్తిగా నిమగ్నమయ్యారు. విద్యార్థినులు కూడా ఈ పోటీలకు సై అన్నారు. దేశం నలుమూలల నుంచి ఈ పోటీలకు విచ్చేసిన వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ఒక చక్కని స్నేహపూర్వక సృజనాత్మక పోటీలకు ఆతిధ్యమిస్తున్న ఆదిత్య విద్యా సంస్థలను కొనియాడారు.







