UPDATED 30th MAY 2017 TUESDAY 7:00 PM
పెద్దాపురం: ప్రతీ గ్రామానికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే లక్ష్యం అని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని కట్టమూరు గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామంలో దాతలు ఈ ప్లాంట్ ను నెలకొల్పడం శుభపరిణామం అన్నారు. అనంతరం గ్రామంలో ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటిసి సుందరపల్లి శివనాగరాజు, ఎంపిటిసిలు అడపా గంగాధరం, గుత్తుల సూర్యావతీ శ్రీనివాస్, టిడిపి జిల్లా కార్యదర్శి జివివి వీర్రాజు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.







