Sai dharam tej: సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు ఇచ్చాం: సైబరాబాద్‌ సీపీ

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021‌: సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశామని, ఆయన కోలుకున్న తర్వాత నోటీసులు కూడా ఇచ్చామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. ‘‘91 సీఆర్పీసీ కింద సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు జారీం చేశాం. లైసెన్స్, బైక్ ఆర్‌సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్ల వివరాలన్నీ ఇవ్వాలని నోటీసులు పంపాం. ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు. త్వరలోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తాం’’ అని తెలిపారు.

సైబరాబాద్ వార్షిక నేర నివేదిక విడుదల:

సైబరాబాద్‌ పరిధిలో ఈ ఏడాది చోటుచేసుకున్న నేరాల నివేదికను ఆనంద్‌ సోమవారం విడుదల చేశారు. ఆస్తులకు సంబంధించి 4.3 శాతం నేరాలు పెరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే రహదారి మృతుల సంఖ్య తగ్గిందని, ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 759 మంది మృతి చెందారని తెలిపారు. వీటిల్లో శిరస్త్రాణం (ద్విచక్ర వాహనదారులు) ధరించక 82 శాతం మంది చనిపోయారన్నారు. 712 రహదారి ప్రమాదాల్లో మద్యం మత్తు కారణంగా 212 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్ల నుంచి రూ. 4.5 కోట్ల జరిమానా వసూలైనట్టు తెలిపారు. 9981 మంది వాహనదారుల లైసెన్స్‌ రద్దు చేశామన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us