ప్రగతిలో జె.ఎన్.టి.యూ.కె గేమ్స్ మీట్

UPDATED 18th FEBRUARY 2018 SUNDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 18,19 తేదీలలో జె.ఎన్.టి.యూ.కె జోన్- బి అంతర కళాశాలల పురుషుల గేమ్స్ మీట్ ప్రారంభమైనట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ గేమ్స్& స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. అబ్బయ్య, గౌరవ అతిథిగా యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ జి. శ్యాంకుమార్ హాజరైనారు. ప్రార్ధనాగీతం, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ తమ కళాశాల వేదికగా ఈ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని, క్రీడా కార్యక్రమాలు విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచి బహుముఖ ప్రజ్ఞాశాలిగా మలుస్తాయన్నారు. తమ కళాశాల విద్యార్థులకు క్రీడలతో సహా అన్ని రంగాలలో శిక్షణ ఇస్తూ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నామని, క్రీడాకారులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ప్రొఫెసర్ జి. అబ్బయ్య, డాక్టర్ జి. శ్యాం కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా స్పూర్తితో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఖో-ఖో, కబడ్డీ, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాలీ బాల్, క్రీడలలో నియమ నిబంధనలను పాటిస్తూ విజయం సాధించాలని అన్నారు. అనంతరం బెల్లూన్లను గాలిలోకి ఎగురవేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, వివిధ విభాగాల అధిపతులు, స్పోర్ట్స్ ఇంఛార్జ్ కె. రఘురాం, బి. ఆదినారాయణ, కె. లక్ష్మీదేవి, హరిబాబు, అహ్మద్, సీనియర్ అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us