TTD : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల

UPDATED 24th MAY 2022 TUESDAY 10:10 AM

Tirumala : ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను టీటీడీ ఇవాళ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఉదయం 9 గంటలకు వెబ్‌సైట్‌తో పాటు గోవింద యాప్‌ ద్వారా విడుదల చేయనున్నారు.

అలాగే ఆగస్టుకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జూలై నెలకు అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. జూలై, ఆగస్టు నెలలకు వర్చువల్‌ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల బుకింగ్‌ రేపు ఉదయం 9 గంటల నుంచి మొదలుకానుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us