తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: సీఎం జగన్

అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 నవంబర్ 2021 : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకే దీపావళి అన్న ఆయన.. తెలుగు ప్రజలకు సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని సీఎం కోరుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హరిచందన్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us