ప్రగతిలో స్టాటిస్టిక్స్ విత్ ఆర్- ప్రోగ్రామింగ్ అంశంపై ఇండక్షన్ ప్రోగ్రాం

UPDATED 18th JUNE 2018 MONDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్ మెంట్ అఫ్ మ్యాథమెటిక్స్ విభాగం, ఎఐసిటిఈ-ఐఎస్.టిఇ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టాటిస్టిక్స్ విత్ ఆర్- ప్రోగ్రామింగ్ అంశంపై ఇండక్షన్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖరగ్ పూర్ ఐఐటికు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డాక్టర్ బుధ్వానంద్ బెనర్జీ హాజరైనారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ తమ కళాశాలలో వారంరోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఇంజనీరింగ్ విద్యలో విద్యార్థులకు, అధ్యాపకులకు ఆర్-ప్రొగ్రామింగ్ లోని నూతన పోకడలు గురించి తెలియచేస్తుందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ రీసెర్చ్ విభాగంలో తమ కళాశాల ఆర్&డి విభాగం కెమిస్ట్రీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని, అలాగే మ్యాథమెటిక్స్ విభాగం నిర్వహించే ఈ కార్యక్రమం గణాంక అంశాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ బెనర్జీ మాట్లాడుతూ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల, ఎఐసిటిఈ- ఐఎస్.టిఇ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థులకు, అధ్యాపకులకే కాక రీసెర్చ్ స్కాలర్స్ కి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ డాక్టర్ టి. సత్యనారాయణ మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం డేటా సైన్స్, ఎనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లలో ఆర్- ప్రోగ్రామింగ్ సాఫ్ట్ వేర్ అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఈ ప్రోగ్రాంలో 30 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ మేనేజ్మంట్ ఎమ్.వి. హరనాథ బాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ అర్&డి డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, హెచ్.వో.డి బిఎస్&హెచ్ డాక్టర్ ఎమ్. బాలయ్య, వివిధ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us