ఇరిగేషన్ అధికారులపై హోం మంత్రి ఫైర్

UPDATED 18TH MAY 2017 THURSDAY 5:00 PM

పెద్దాపురం: చెరువు పనులు, కల్వర్ట్ల నిర్మాణ జాప్యం పై ఇరిగేషన్ అధికారులపై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో  ఇరిగేషన్, పలు శాఖల అధికారులతో చెరువు పనులు, కల్వర్ట్ల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో ఇప్పటి వరకు ఎటువంటి ప్రగతి కనిపించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నైరుతి రుతు పవనాలు ఈ నెలాఖరుకల్లా రాష్ట్రాన్ని తాకి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసినా అధికారుల్లో ఎటువంటి స్పందనా లేకపోవడం పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతవరకు నియోజక వర్గంలో ఇరిగేషన్ పనులు మొదలు పెట్టిన దాఖలాలు లేకపోవడం తో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలాఖరుకల్లా వర్షాలు కురిస్తే పనులకు ఆటంకం కలిగి నిలిచిపోతాయని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని, వర్షాలు కురవక ముందే పనులు తక్షణమే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. అలాగే సామర్లకోటలో సాగు నీటి కాలువల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఇచ్చిన నివేదిక ప్రకారం పనులు వేగవంతంగా జరిపించి రైతులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. మరో మూడు రోజుల్లో పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని పేర్కొన్నారు. అలాగే ఎన్ఆర్ఈజిఎస్  పనులు నియోజక వర్గంలో సరిగ్గా జరగడం లేదని ఎపిడి పై మంత్రి సీరియస్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రాంబాబు, ఈఈ జగదీష్, అడిషనల్ డిఈ అప్పలనాయుడు, డిఈ విజయకుమార్, నరసింహారావు  ఏఈ అప్పలరావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలిశెట్టి నాని, సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సామర్లకోట ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ  చైర్మన్ అడబాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us