UPDATED 14th SEPTEMBER 2017 THURSDAY 8:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య బిజినెస్ స్కూల్లో సాఫ్ట్ స్కిల్స్ పై గురువారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ ప్రొఫెసర్ అజిత్ రవి ఫిల్కానా హాజరై విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ పై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యాపారాత్మక మెళకువలు, ఆంగ్ల భాషా పరిజ్ఞానం మొదలైన విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ పై అవగాహనతో పాటు భవిష్యత్తులో వ్యాపారరంగంలో ముందుకు సాగేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని విద్యార్థులకు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ వర్క్ షాప్ మూడు రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.







