వ్యాపార రంగంలో మానవ వనరుల పాత్ర కీలకం

UPDATED 15th JULY 2017 SATURDAY 7:30 PM

గండేపల్లి: వ్యాపార రంగంలో మానవ వనరుల పాత్ర ఎంతో కీలకమని గీతం యూనివర్సిటీ (వైజాగ్) అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ వి.వి.ఎస్.ఎస్.ఎస్. ప్రసాద్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మానవ వనరులు వాటి ప్రాముఖ్యత అనే అంశం పై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై శనివారం మాట్లాడారు. నేటి వ్యాపార రంగంలో మానవ వనరుల పాత్ర చాలా కీలకమని దానిపై సరైన అవగాహన పెంచుకోవడం విద్యార్థి అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. ఉద్యోగ అవకాశాల ప్రాముఖ్యత పై ఆయన ఇచ్చిన ప్రసంగం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. మేనేజ్మెంట్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన ప్రముఖుల కోసం ఆయన ఇచ్చిన ఉపన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యలో కేస్ స్టడీ ఎంతో ప్రాముఖ్యమైనది విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుగుణారెడ్డి , ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, డాక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.   
        
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us