Vadapalli : ఈనెల 14 నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

UPDATED 14th OCTOBER 2022 FRIDAY 06:00 AM

Konaseema Thirumala Vadapalli : కోనసీమ తిరుమల వాడపల్లి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. శ్రీవేం కటేశ్వరస్వామి పదో వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా నిర్వి హంచనున్నారు. యాగశాలలో హోమాలు జరుపుతారు. వసంత మండపంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదా చార్యులు బ్రహ్మ త్వంలో వేద పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపు తారు. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వరకు ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలంకరణలతో కూడిన భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయాన్ని ఫల, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు.

గురువారం స్వామివారికి తిరుమంజన సేవ నిర్వ హించారు. శుక్రవారం అకల్మష హోమం, నవమూర్తి అవాహన, ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను ప్రార ంభిస్తారు. రాత్రి పరావాసుదేవ అలంకరణతో శ్రీవారు శేష వాహనంపై విహరించి భక్తులకు దర్శనమీయనున్నారు.

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్య నారాయణరాజు చెప్పారు. ప్రతిరోజూ జరిగే కార్యక్రమాల వివరాలు తెలిపారు. 15వ తేదీ శనివారం మహా పుష్పయాగం, సహస్రదీపాలంకరణ సేవ, సరస్వతి అలంకరణతో హంస వాహనసేవ, కేరళ వాయిద్యాలు, తంబోలా నృత్యం, శ్రీకాకుళం వారి తప్పెటగుళ్లు ప్రదర్శన ఉంటుంది. 16వ తేదీ ఆదివారం ఉదయం శ్రీనివాస కల్యాణం, రాత్రి కోదండరామ అలంకరణతో హనుమద్వాహన సేవ, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.

17వ తేదీ సోమవారం తోమాల సేవ, మహా సుదర్శన హోమం. యోగనారసింహ అలంకరణతో సింహ వాహన సేవ, కేరళ వాయిద్యం, గిరిజన సంప్రదాయ వాయిద్యం, దాండియా కోలాటం ఉంటుంది. 18వ తేదీ మంగళవారం అష్టదళపాదపద్మారాధన, మలయప్ప అలంకరణతో గరుడవాహన సేవ, కేరళ వాయిద్యం, కోలాట ప్రదర్శన, 19వ తేదీ బుధవారం సుప్రభాత సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, శ్రీకృష్ణ అలంకరణతో సూర్యప్రభ వాహన సేవ, లక్ష్మీవేంకటేశ్వర హోమం, మోహినీ అలంకరణతో చంద్రప్రభ వాహనసేవ, తెలంగాణ బోనాల కోలాటం, అన్నమయ్య సంకీర్తనలు, 20వ తేదీ గురువారం తిరుప్పావడ సేవ, రాజాధిరాజ అలంకరణతో శ్రీవారికి గజ వాహన సేవ ఉంటుంది. వివిధ వాయిద్యాలు, ప్రదర్శనలు ఉంటాయి.

21వ తేదీ శుక్రవారం గోదావరి నదీ జల సంగ్రహణం, లక్ష కుంకుమార్చన, మహాలక్ష్మి హోమం, చూర్ణోత్సవం, కల్కి అలంకరణతో అశ్వ వాహన సేవ. కేరళ వాయిద్యాలు, డోలు సన్నాయితో పాటు మహారాష్ట్ర వాయిద్య కళాకారులతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 22వ తేదీ శనివారం మహా పూర్ణాహుతి, చక్రస్నాన మహోత్సవం, మహదాశీర్వచనం, ఏకాంత సేవ, మహారాష్ట్ర వాయిద్య కళాకారులు, కేరళ వాయిద్యం, డోలు సన్నాయిలతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us