3 నుంచి ఆదిత్యలో మొదటి సంవత్సరం బిటెక్ తరగతులు

UPDATED 1st JULY 2017 SATURDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో 2017-18 విద్యా సంవత్సరం బిటెక్ మొదటి సంవత్సరం తరగతులు ఈ నెల 3 నుంచి ప్రారంభం అవుతాయని సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తమ కళాశాలలో జాయిన్ అయిన   విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇంజనీరింగ్ విద్యావిధానంలో హాజరు యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందని, అటెండన్స్ కారణంగా కూడా ఎంతో మంది ఉత్తీర్ణత సాధించలేకపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని తమ సంస్థ నిలబెడుతుందని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు తమ విద్యా సంస్థ అహర్నిశలు శ్రమిస్తున్నదన్నారు. విద్యార్థుల సౌకర్యార్ధం వారికి బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us