Updated 12th May 2023 Friday 6:10 pm
Pawan Kalyan On Alliance : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. పార్టీ శ్రేణులకు మరింత క్లారిటీ ఇచ్చేశారు. అన్నీ బాగుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు సీఎం సీటు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి మాట్లాడుకుందామన్నారు పవన్ కల్యాణ్. సీఎం ఎవరనేది ముఖ్యం కాదన్న పవన్.. ఇప్పుడున్న సీఎంను గద్దె దించడమే మనందరి లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బలాబలాలను బట్టి అప్పుడే నిర్ణయించుకుందామన్నాని పవన్ అన్నారు.
గత ఎన్నికల్లో వచ్చిన 7 శాతం ఓట్లు తక్కువ కాదు. ప్రస్తుతం 14 నుండి 18 శాతం ఓటింగ్ ఉంది. కృష్ణా నుండి శ్రీకాకుళం వరకు 25 శాతం ఓటింగ్ ఉంది. గోదావరి జిల్లాల్లో 35 శాతం ఓటింగ్ ఉంది. ఈ బలం ప్రభుత్వాన్ని సాధించే బలం కాదు. ఇంకోసారి ఓడిపోవడానికి సిద్ధంగా లేను. కచ్చితంగా ప్రభుత్వం స్థాపించే తీరాలి.
త్రిముఖ పోరులో బలి కావడానికి సిద్ధంగా లేను. కచ్చితంగా పొత్తు ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక సీఎం అవ్వాలా లేదా నిర్ణయిద్దాం. అనుకున్న స్థాయిలో ఓట్లు వస్తే అప్పుడు మాట్లాడటానికి మనకి హక్కు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో మన ప్రత్యర్థి వైసీపీ. రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసింది వైసీపీ. సీఎం జగన్ చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు? ఏ కులానికీ న్యాయం చెయ్యలేదు. జగన్ ను అధికారం నుండి తీసెయ్యాల్సిందే. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వ్యక్తిని అధికారం నుండి తీసెయ్యాల్సిన బాధ్యత అందరిదీ.







