హెచ్ఆర్ఎం, సిఎఫ్ఎంఎస్ విధానాలపై అవగాహన పెంచుకోవాలి

UPDATED 20th APRIL 2018 FRIDAY 6:00 PM

కాకినాడ: ప్రభుత్వం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్  సిస్టం, సిఎఫ్ఎంఎస్ విధానాలను పక్కా ప్రణాళికతో అమలు చేస్తోందని, దీనిపై ఉద్యోగులు అవగాహన పెంపొందించుకుని, వెబ్ పోర్టల్ లో డేటా అప్ లోడ్ చేయాలని జిల్లా జాయింట్ కలక్టర్-2 జె. రాధాకృష్ణమూర్తి తెలిపారు. స్థానిక విధాన గౌతమీ హాలులో శుక్రవారం రెవెన్యూ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విధానాలపై శిక్షణను అవగాహన చేసుకుని, డివిజన్, మండల స్థాయిలో అమలు చేయాలన్నారు. సిఎఫ్ఎంఎస్ ఉద్యోగుల వివరాలు నమోదు చేస్తే దానిని తొలగించడం కష్టమని దానిని ఖచ్చితంగా, తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. ఈ శిక్షణలో మీకు వచ్చిన అనుమానాలు నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషవన్ ద్వారా వివరించడం జరుగుతుందని, వాటిని జాగ్రత్తగా విని పక్కాగా నేర్చుకోవాలని అన్నారు. తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దార్లు అందరూ నేర్చుకుని సిసిఎల్ఎ ఆదేశాల ప్రకారం ఉద్యోగుల వివరాలు నమోదు చేయాలన్నారు. రెవెన్యూ అధికారులకు యూజర్ ఐడి, పాస్ వర్డ్  ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్ లో ఉన్న అన్ని వివరాలు సిఎఫ్ఎంఎస్ డేటా ఎంట్రీ చేయాలన్నారు. వివరాలన్నీ సిఎఫ్ఎంఎస్ నమోదు చేయడం ద్వారా పర్మినెంట్ రికార్డుగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కలక్టరేట్ ఎవో  భీమారావు, సూపరింటెండెంట్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us