ఐటిసి కంపెనీ సందర్శించిన ఆదిత్య విద్యార్థులు

UPATED 20th NOVEMBER 2018 TUESDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య బిజినెస్ స్కూల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు భద్రాచలం సమీపంలోని సరపాకలో గల ఐటిసి పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ డివిజన్ ను సందర్శించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వివిధ పరిశ్రమలను, కంపెనీలను స్వయంగా సందర్శించడం వల్ల వారు భవిష్యత్తులో పరిశ్రమలు నెలకొల్పడానికి కావలసిన అంశాలను సులభంగా తెలుసుకుని వ్యవస్థాపకులుగా రాణించడానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రత్యక్షంగా చూసి సంపాదించిన జ్ఞానంతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచి తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకొని వాటి సాకారానికి కృషి చేయాలని, మేనేజ్ మెంట్ విద్యార్థులు ఇటువంటి పరిశ్రమల సందర్శనం ద్వారా కలిగే అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us