మరింత బలపడిన అల్పపీడనం.. ఉత్తర కోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు వర్ష సూచన

అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021 అండమాన్‌ సముద్రం ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తదుపరి 24 గంటల్లో వాయుగుండం.. తుపానుగా బలపడుతుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదులతూ డిసెంబరు 4వ తేదీ నాటికి ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశాల మధ్య తీరాం దాటే అవకాశమున్నట్టు తెలియజేసింది. దీని ప్రభావంతో ఈనెల 3 నుంచి ఉత్తర కోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. కోస్తాంధ్ర తీరప్రాంతంలోని మత్స్యకారులు రాగల రెండు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది. పోర్టులకు కూడా అప్రమత్తత హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉభయగోదావరి, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన రైతులు పంటలు కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us