విలేజ్ యాక్షన్ ప్లాన్స్ తో సత్ఫలితాలు సాధించాలి

UPDATED 26th MAY 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: విలేజ్ యాక్షన్ ప్లాన్స్ రూపొందించడంలో పొందిన శిక్షణను గ్రామస్థాయిలో వినియోగించడం ద్వారా సత్ఫలితాలు సాధించాలని విస్తరణ శిక్షణా కేంద్రం ట్రైనింగ్ మేనేజర్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో విలేజ్ యాక్షన్ ప్లాన్స్ రూపొందించడంపై అయిదు జిల్లాల పంచాయతీ రాజ్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షణ పొందిన సిబ్బందికి సర్టిఫికెట్లను అందజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భముగా సామర్లకోట ఎంపిడివో కె. స్వప్నమాట్లాడుతూ విలేజ్ యాక్షన్ ప్లాన్స్ రూపొందించేందుకు నిర్వహించిన ఈ శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణ శిక్షణా కేంద్రం అధికారులు డి.ఎం. సిల్వియా, జె. రాంబాబు, ఎ. గోపాలరావు, టి.ఎల్.ఎన్.కె. రాజా, ఎస్. కె. మొహిద్దిన్, ఆర్.పి.ఎస్. శేషుబాబు, రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us