Bheemla NayaK: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్‌కు ట్రాఫిక్ ఆంక్షలు, పాత పాసులు చెల్లవు

UPDATED 22 FEBRUARY 2022 TUESDAY 09:00 PM

Bheemla NayaK: నెలల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల కలల వేడుక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధమైంది. అనుకోని కారణాలతో సోమవారం ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈవెంట్ రద్దు కావడంతో బుధవారం నిర్వహించాలని ప్లాన్ చేశారు.

అభిమానుల తాకిడితో ప్రయాణికులు ఇక్కట్లకు గురికాకుండా ఉండేందుకు ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. బుధవారం మద్యహ్నం 2గంటల నుంచి రాత్రి 11గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుక జరుగనుండగా.. మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ వైపు వచ్చే వాహనాలకు సవేరా ఫంక్షన్ హాల్-క్రిష్ణ కాంత్ పార్క్-కళ్యాణ్ నగర్-సత్యసాయి నిగమగమం-కృష్టానగర్ మీదుగా దారి మళ్ళించనున్నారు.

జూబ్లిహల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడ వైపుగా వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపుకు మళ్ళిస్తారు. భీమ్లా నాయక్ వేడుకకు వచ్చే వాహనాలకు సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారు.21వ తేదీ కోసం ఇష్యూ చేసిన పాసులకు అనుమతి లేదని.. కేవలం 23వ తేదీతో ఉండే పాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us